- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు. 4 రోజుల పాటు ఏప్రిల్ 1 వరకు కస్టడీని పొడగిస్తూ తీర్పు వెలువరించింది.కేజ్రీవాల్ ని వారం రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరగా నాలుగు రోజులకు మాత్రమే అంగీకారం తెలిపింది కోర్టు. లిక్కర్ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదన్న ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకుంది న్యాయస్థానం.
ఈడీ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించగా కోర్టులో నేరుగా వాదనలు వినిపించారు కేజ్రీవాల్.ఏ కోర్టు నన్ను దోషిగా గుర్తించలేదు. నాపై ఆరోపణలు చేయలేదని తెలిపారు కేజ్రీ. కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా విచారించాల్సిన అవసరం ఉందని.. గోవా నుండి పిలిపించబడిన కొంతమంది వ్యక్తులతో కేజ్రీవాల్‌ను కలిపి ప్రశ్నించాల్సి ఉందన్నారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..
- Advertisement -