కీర్తి..మిస్ ఇండియా@ 11 కోట్లు

215
keerthy suresh

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు కీర్తి సురేష్. ఇటీవలె ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి త్వరలో మిస్ ఇండియాగా అలరించనుంది. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే కీర్తి నటించిన పెంగ్విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కీర్తి మరో మూవీ కూడా ఓటీటీలో విడులకు రంగం సిద్దమైంది. మిస్ ఇండియా మూవీని 11 కోట్లు వెచ్చించి దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్‌.

ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న విడుదల కావాల్సిఉండగా.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఓటీటీలో విడుదలకు లైన్ క్లియర్ కావడంతో త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు నిర్మాతలు.