మహానటి మూవీని రిజెక్ట్ చేశా..కానీ!

4
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మహానటి. సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ముఖ్యంగా కీర్తి సురేశ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహానటి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు కీర్తి. మహానటి సినిమాను మొదట్లో తాను రిజెక్ట్ చేయాలనుకున్నానని చెప్పారు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు భయం వేసిందన్నారు. ఎవరో ఒక అమ్మాయి ఎక్కడి నుండో వచ్చి ఒక లెజెండ్​పై బయోపిక్ చేస్తే ప్రేక్షకులు అది చూసి నేను దానిని సరిగ్గా చేయలేదని చెప్తే ఎలా ఉంటుందోనని భయపడ్డానని అందుకే నో చెప్పానని తెలిపారు.

అయితే నాగ్ అశ్విన్ తనను ఎంతో ప్రోత్సహించారని, తనపై వారు ఉంచిన కాన్ఫిడెన్స్ వల్లే మహానటికి ఒప్పుకున్నానని, సినిమా అంత అద్భుతంగా వచ్చిందన్నారు. నా మీద నాకు లేని నమ్మకం నాగ్ అశ్విన్​కు ఉంది…. అదే నన్ను మహానటి సినిమాను చేసేలా చేసిందని చెప్పుకొచ్చారు.

Also Read:అక్షరం మార్పు కోసం 1000 కోట్లా?

- Advertisement -