కీర్తి సురేష్ హాస్యనటుడ్ని వివాహం చేసుకుందా?..

999
- Advertisement -

అందాల నటి కీర్తి సురేష్ తమిళ హాస్యనటుడు సతీష్‌ను వివాహం చేసుకుందా? అంటే అవుననే సమాధానం వినిస్తోంది. ఈ హాట్ న్యూస్ పై ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. సతీష్ హాస్యనటుడిగా ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతున్నాడు. తెలుగు, తమిళ చిత్రాలతో కీర్తి కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. నేను శైల‌జ‌ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి కీర్తి ప్రస్తుతం.. నానితో నేను లోకల్ చిత్రంలో నటిస్తోంది. ఆ తరువాత బన్నీతోనూ కీర్తి నటించనుంది. అలాంటిది కీర్తి ఈ స‌డెన్ మ్యారేజ్ చేసుకోవడం ఏంట‌ని ఫిల్మ్ లవ్వర్స్ షాక్ అవుతున్నారు. దీనికి ఈ ఫోటోలే సాక్ష్య‌మంటున్నారు కొంద‌రు. కోలీవుడ్ వెబ్‌సైట్‌లతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ఫోటోలు హల్ చల్చేస్తున్నాయి.

ఈ విషయాన్ని నటుడు సతీష్ దగ్గర ప్రస్తావిస్తే.. అసలు కీర్తికి నాకు సంబంధమే లేదు.. ఈ వార్తని ఎవరు పుట్టించారోనని చెప్పాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.అంతేకాదు కీర్తి కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా విజ‌య్ సినిమా షూటింగ్ కోసం తీసిన ఫోటోల‌ను ఎడిటింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫోటోలో దండలు అందరి మెడలరూ ఉన్నా.. ఎడిటింగ్‌లో మిగ‌తావారిని డిలీట్ చేసి.. కేవ‌లం ఈ ఇద్ద‌రిని మాత్ర‌మే ఉంచారు. దీంతో కీర్తి సురేష్ పెళ్లి వార్తల పుకార్లు కోలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. అయితే స్వయంగా కీర్తి సురేష్ వివరణ ఇవ్వడంతో ఇదంతా అబద్దం అని తేలిపోయింది.

- Advertisement -