మ‌హేశ్ బాబుతో మ‌హాన‌టి..

241
mahesh babu keerthi suresh
- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బాస్ట‌ర్ మూవీతో అల‌రించాడు. ఈమూవీ మ‌హేశ్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. మ‌హేశ్ త‌న 27వ చిత్రాన్ని ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మ‌హేశ్ బాబు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమాకు ‘స‌ర్కారు వారి పాట’ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.

ఇటివ‌లే ఈమూవీ ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు. ఈమూవీ ఫ‌స్ట్ లుక్ తోనే ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్నాడు మ‌హేశ్. కాగా ఈమూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నారు. చిత్ర‌యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరిపారని, కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా, రంగ్ దే’ సినిమాల్లో నటిస్తోంది. మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వ‌ర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంచ‌భించ‌నున్నారు. 2021 స‌ంక్రాంతికి ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -