నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చిన ఆచితూచి సినిమాలు చేస్తోంది. నానితో నేను లోకల్ మూవీ చేసిన కీర్తి ప్రస్తుతం రైజింగ్‌లో ఉంది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫస్ట్ ఛాయిస్ ‘కీర్తి’కే ఇస్తున్నారు.
ప్రస్తుతం అలనాటి నటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటితో పాటు పవన్-త్రివిక్రమ్ అజ్ఞాతవాసి,సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన కీర్తి…గ్లామర్ పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది.సావిత్రి పాత్రలో నటించాలంటే మొదట్లో తాను భయపడ్డానని…అది ఓ సాహసమే అని చెప్పుకొచ్చింది.
తెలుగులో నేను చేసిన మొదటి సినిమా ‘నేను శైలజ’. అది నాకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందంటే..ఇప్పటికీ కొందరు నన్ను శైలజా అంటూ పిలుస్తారని తెలిపింది. నయనతార ఎంచుకునే దుస్తులంటే చాలా ఇష్టం. దుస్తుల ఎంపికలో ఆమెకు ఆమే సాటి. తన డ్రెస్స్టైల్ బాగా నచ్చుతుంది. ఇక, నటన పరంగా చెప్పాలంటే బాలీవుడ్లో కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా ఇప్పటికీ మర్చిపోలేనని తెలిపింది.
తనతో పనిచేసిన హీరోలందరిపై ప్రశంసలు గుప్పించింది. సూర్యకు పెద్ద అభిమానిని అని చెప్పిన కీర్తి..పవన్ చాలా సింపుల్‌గా ఉంటాడని…ఏదైనా సందేహం అడిగితే చిరునవ్వుతోనే సమాధానం ఇస్తాడని చెప్పింది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందని …దాన్ని తెలుసుకునేందుకూ ప్రయత్నిస్తానని చెప్పింది ఈ మహానటి బ్యూటీ.