డబ్బింగ్ కార్యక్రమాల్లో అర్జున్ రెడ్డి

145
Vijay Begins Dubbing for Arjun Reddy

విజయ్ దేవరకొండ, షాలిని, జియాశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తున్నారు. పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ సరికొత్త ట్రెండ్‌గా మారాడు. విజయ్ సినిమా  వస్తుందంటే చాలు, యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Vijay Begins Dubbing for Arjun Reddy

రెగ్యులర్ మూస కథల్లా కాకుండా డిఫరెంట్ జోనర్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే అర్జున్ రెడ్డి ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.   ఈ సినిమా ట్రైలర్ చూస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఒక యంగ్ డాక్టర్ కథ అని తెలిసిపోతుంది.  బోల్డ్‌ మూవీస్‌ చేసే ధైర్యం బాలీవుడ్‌ హీరోలకే తప్ప మనవాళ్లకి లేదని అనుకునేవాళ్లు ఈ యంగ్ హీరో బోల్డ్ స్టెప్ ని భయంకరంగా అప్రిసియేట్ చేస్తున్నారు.

తాజాగా ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొత్త‌ద‌రం ద‌ర్శ‌కులు కొత్త పాయింట్‌తో రాక‌పోయినా.. కొత్త ట్రీట్‌మెంట్‌తో ఆక‌ట్టుకొంటున్నారు. ఆ జాబితాలో ఈ అర్జున్ రెడ్డి కూడా చోటు ద‌క్కించుకొంటుదేమో చూడాలి. వేస‌విలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.