ఫ్లాస్మా దానం చేసిన కీరవాణి…

127
keeravani

ఫ్లాస్మా దానం పట్ల సైబరాబాద్ పోలీసులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు సినీ ప్రముఖులు ఫ్లాస్మా దానం చేసేందుకు ముందుకురాగా తాజాగా కరోనా నుండి కోలుకున్న సంగీత దర్శకుడు కీరవాణి ఫ్లాస్మా దానం చేసి శభాష్ అనిపించుకున్నారు.

కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి ప్లాస్మా బ్రహ్మాస్త్రంగా పని చేస్తుందని …తాను పూర్తిగా కోలుకున్న తర్వాత ఫ్లాస్మా దానం చేస్తానని తెలిపిన కీరవాణి చెప్పినట్లుగానే ఫ్లాస్మాను డోనేట్ చేశారు. త‌న‌యుడు భైర‌వతో కలిసి ‌కిమ్స్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మాను డొనేట్ చేశారు. ర‌క్త‌దానం చేసిన‌ట్టే ఉంది. దీనికి పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని కీర‌వాణి త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.