దేశంలో 24 గంటల్లో 70వేల కరోనా కేసులు..

140
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 69,921 కరోనా కేసులు నమోదుకాగా 819 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 36,91,173కి చేరాయి.

ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,85,996 ఉండగా 28,39,882 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 65,288కి చేరగా గత 24 గంటల్లో 65,081 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 4.5 కోట్లు దాటగా రోజుకు 10 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.