రాష్ట్రంలోని ఎనమిది కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తు సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ ఛైర్మన్‌గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, ఉమెన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి,హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మడుపు భూమ్ రెడ్డి, గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గాంధీ నాయక్,ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ ఛైర్మన్‌గా పుష్కర్ రామ్మోహన్‌రావు,రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్‌గా కె.వాసుదేవరెడ్డి,మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్,టెక్నికల్ సర్వీసెస్ ఛైర్మన్‌గా చిరుమల్ల రాకేష్ కుమార్‌ను నియమించారు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మెదక్ డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఎలక్షన్ రెడ్డి పేరు కూడా ఖరారైంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఎలక్షన్ రెడ్డి తిరిగి రాగానే ఆయనకు ఇవ్వాల్సిన కార్పొరేషన్ గురించి చర్చించనున్నారు.
వీటితో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించారు సీఎం కేసీఆర్. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ గుండు సుధారాణి,టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడిగా ఓయు విద్యార్ధి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లను నియమించారు.