బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..

68
- Advertisement -

హస్తినలో గులాబీ జెండ రెపరెపలాడింది. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌ గా మార్చగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ ఎంపీ చిదంబరం, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంతరం కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం కంటే ముందు.. రాజ‌శ్యామ‌ల యాగం పూర్ణాహుతికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -