దుర్గమ్మ సన్నిధిలో సీఎం కేసీఆర్…

236
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ నుంచి విజయవాడ బయలుదేరిన కేసీఆర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రి దేవినేని..కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి దుర్గమ్మ గుడికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు,పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బంగారు ముక్కుపుడకను అమ్మవారికి కానుకగా ఇచ్చి మొక్కును చెల్లించారు సీఎం.

కేసీఆర్ రాక సందర్భంగా బెజవాడలోని పలు కూడళ్లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు,బ్యానర్‌లతో గులాబీమయంగా మారిపోయింది. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముక్కుపుడకను తయారుచేయించింది. బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగిన ముక్కుపుడక 11.29 గ్రాముల బరువు ఉంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ వరంగల్ భద్రకాళి అమ్మవారికి,కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించిన సంగతి తెలిసిందే. ద్రకాళి అమ్మవారికి సీఎం బంగారు కీరిటాన్ని సమర్పించారు. రూ.3.70 కోట్ల విలువ గల 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

ఇక తిరుమల శ్రీవారికి సైతం రూ. 5కోట్ల విలువైన స్వర్ణాభరణాలను స్వామివారికి సమర్పించారు. రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాన్ని సమర్పించారు కేసీఆర్.

- Advertisement -