సర్జికల్ స్ట్రైక్స్ వీడియో రిలీజ్..

250
surgical strike

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టించింది. అయితే అప్పట్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అంత ఉత్తదేనని, సాక్ష్యం చూపించాలంటూ ఆరోపణలు చేశాయి. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్‎కు సంబంధించిన వీడియోలను కేంద్రం విడుదల చేసింది.

Surgical strikes

ఈ వీడియోలు ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి పలు టీవీ ఛానల్లు, సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తెల్లవారుజామున ఇండియ్ ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. ఆర్మీ అధికారులు జరిపిన దాడులలో ఉగ్రవాదులు, మిలటరీ కట్టడాలు, బంకర్లు ధ్వంసం అయినట్లు ఉంది.

మరోవైపు అప్పట్లో ఈ సర్జికల్ స్ట్రైక్స్‎కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‎చల్ చేశాయి. పాకిస్థాన్ మాత్రం ఇండియన్ ఆర్మీ ఎల్ఓసీ దాటి రాలేదని, ఎప్పటిలాగే కాల్పులు జరిపిందని కొట్టేపారేసింది. తాజాగా ఈ వీడియోలతో, అటు పాకిస్థాన్‎కి, ఇటు సర్జికల్ స్ట్రైక్స్‎కి సాక్ష్యం ఏంటని అడిగిన వారికి, కేంద్రం ఈ వీడియోలను విడుదల చేసి సరైన సమాధానం చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఆర్మీ‎కి సంబంధించిన వీడియోలను బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. యూపీ ఎన్నికల సమయంలోను సర్జికల్ దాడులను బీజేపీ వాడుకుందని, ఆర్మీ ధైర్య సాహసాలను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత రణ్‎దీప్ సుర్జేవాలా విమర్శించారు.