లోకేష్‌కు బుద్ధి,జ్ఞానం లేదు..

198
KCR treats Andhra people well
- Advertisement -

ఏపీ మంత్రి నారా లోకేష్ పై సినీనటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. తాము ఎన్నారైలు అయితే లోకేష్ ఎవరని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ తిట్టలేదని  ఏపీ రాజకీయ నేతలను మాత్రమే తిట్టారని గుర్తుచేశారు.  లోకేష్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే… మమ్మల్ని తరిమికొట్టేవారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు.

లోకేష్, మీకేమైనా బుద్ధి, జ్ఞానం ఉందా? చదువుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీరు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా… ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని సూచించారు. మీలాంటి నేత ఉమ్మడి ఏపీలో ఉండి ఉంటే తాము నాశనం అయ్యావారమని చెప్పారు.

నంది అవార్డులను విమర్శించినంత మాత్రాన తమను నాన్ లోకల్ అంటారా అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా? అని ప్రశ్నించారు.  నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే… తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు.

తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు… తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా అని అన్నారు. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని… ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని చెప్పారు. నంది అవార్డులను రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -