ఆ ముగ్గురు కలిస్తే బ్రహ్మాండం బద్దలే..!

208
Rajamouli to make a movie with Jr NTR and Ram Charan?
- Advertisement -

దర్శకుడిగా ఇప్పుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ కి.. రోడ్డు మీద పోయేవాడిని హీరోగా పెట్టి సినిమా స్టార్ట్ చేసినా..సినిమా సెట్స్ కి వెళ్ళడానికి ముందే.. అది అలవోకగా 100 కోట్లు బిజినెస్ చేసేస్తుంది. ఇక ఎవరైనా కొంచెం పేరున్న హీరో అయితే 100 కోట్లు కాస్తా అమాంతం 200 కోట్లు అయ్యి కూర్చుంటుంది. అదే ఎన్టీఆర్ లాంటి సూపర్ హీరో జత కలిస్తే.. 200 కోట్లు ఏకంగా రెట్టింపయిపోతుంది. అంటే బాజినెస్ 400 కోట్లకు చేరుతుంది. మరి దానికి రామ్ చరణ్ తాజా కలిస్తే.. అది కచ్చితంగా ‘బాహుబలి’ని మించిపోతుంది. మల్టీ స్టారర్ కే మల్టీ స్టారర్ అయిపోతుంది.

Rajamouli to make a movie with Jr NTR and Ram Charan?

‘స్టూడెంట్ నంబర్ 1’తో ఎన్టీఆర్ కి స్టార్ డమ్ ప్రసాదించి.. ‘సింహాద్రితో సూపర్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన రాజమౌళి.. ‘యమదొంగతో దానిని సుస్థిరం చేయడం తెలిసిందే. ఇక ‘మగధీర’తో.. అప్పటికే తన పేరుకు ముందు ‘మెగా పవర్ స్టార్’ అన్న బిరుదు తగిలించేసుకున్న రామ్ చరణ్ నవ్వుల పాలు కాకుండా సదరు పవర్ ఫుల్ బిరుదుకు గౌరవం తెచ్చిపెట్టిన రాజమౌళి… ఈ ఇద్దరు హీరోలతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

రాజమౌళి తన తదుపరి చిత్రం డి.వి.వి.దానయ్యకు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. ఎవరితో అన్నది ఇంకా తెలియరాలేదు. మరి రాజమౌళి తదుపరి చిత్రంలో ఎన్టీఆర్-ఆర్సీటీ.. అంటే రామ్ చరణ్ కలిసి నటిస్తారేమో వేచి చూడాలి. దీనికోసం చర్చించడానికే ఈ ముగ్గురూ కలిసారేమోననే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే తెలుగు సినిమా చరిత్రలో కచ్చితంగా మైలు రాయిగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు సినిమా అనే బ్రహ్మాండం బద్దలయిపోతుంది!!

- Advertisement -