తప్పకుండా మళ్ళీ రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఇంటగెలిచి రచ్చగెలవాలని ఆగుతున్నామన్నారు. యంగా మమత బెనర్జీ చెప్పారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావు అన్నారు.ప్రాంతీయ పార్టీలకె ఎక్కువ సీట్లు రావాలి…ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయన్నారు. మాకు వస్తున్న సమాచారం అయితే ఏపీ లో జగన్ గెలుస్తున్నాడు..ఒకవైపు కేరళ లో కమ్యూనిస్టు సీఎం తిట్టి ఇక్కడ పొత్తు అంటే వాళ్ళకే తెలువాలన్నారు.బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మార్చలేము అని కేసీఆర్ చెప్పారు.కొన్ని సాంకేతిక అంశాలు అడ్డు వస్తాయి…మార్పు మార్పు అన్నారు వస్తదేమో కావచ్చు అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేది లేదు సచ్చేది లేదు..పార్లమెంట్ ఎన్నికల్లో మేమే ఎక్కువ స్థానాలు గెలుస్తున్నం…రేవంత్ రెడ్డి, రాహుల్ లైన్ లోనా, మోడీ లైన్ లోనా పని చేసేదా అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా ఉండి, నేషనల్ మీడియా లో మోడీ కి ఓటేయ్యండి అంటున్నాడు…రేవంత్ రెడ్డి కచ్చితంగా బీజేపీ లోకి వెళతారన్నారు. ఇప్పటికీ ఈ కామెంట్ పై ఆయన స్పందన లేదు…2014 లో బడే బాయ్ బడా మోసం చేశారు..అనేక హామీలు ఇచ్చిన మోడీ అమలు చేయలేదు.
తెలంగాణ పుట్టుక ను అవమానించిన వ్యక్తి మోడీ అన్నారు.
దేశ ప్రజల నడ్డి విరిచాడు మోడీ..ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేదు..టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోడీ ప్రభుత్వం అన్నారు. మా అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ తో జతకట్టి డమ్మీ అభ్యర్థుల ను పెట్టింది కాంగ్రెస్…మాకు 10 నుంచి 12 సీట్లు ఇవ్వండి కాంగ్రెస్ మెడలు వంచుతాం అన్నారు.
Also Read:KTR:పాలమూరులో ఓటమి దిశగా కాంగ్రెస్