6 ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం కేసీఆర్

40
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. ఆరు దస్త్రాలపై సంతకాలు చేశారు. పోడు భూముల పంపిణీపై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు.

Also Read:నూతన సచివాలయం ప్రారంభం..

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ వంటి వాటిపై సంతకాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మహమూద్‌ అలీ.. ముఖ్యమంత్రికి దట్టీ కట్టారు.

Also Read:కొత్త సచివాలయం… ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే?

- Advertisement -