యూనియన్ నాయకుల ట్రాప్‌లో పడిపోయి అనువుగాని సమయాన సమ్మెకు దిగి, బస్సులను వొదిలిపెట్టి రోడ్డున పడ్డ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికయినా తమ గురించి తమ కుటుంబం పిల్లల గురించి ఆలోచించడం శుభపరిణామం. తండ్రి వంటి సిఎం కెసిఆర్ మీద విశ్వాసముంచి, ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకుని రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరుగా వచ్చి విధుల్లోకి వచ్చి జాయినయితుండడం స్పూర్తి దాయకం.
ప్రభుత్వంలో విలీనం చేస్తేనే.. అనే మూర్ఖపు యూనియన్ నాయకులు విధించిన డెడ్ లైన్ను పట్టుకోని ప్రాణాలు తీసుకుంటున్న మిగిలిన కార్మిక సోదరులు కూడా జ్జానంతో ఆలోచించి మొండిపట్టుదలను వదలి డ్యూటీలో జాయిన్ కావాల్సిన సమయమిది. నవంబర్ 5 అనేది డెడ్ లైన్ కాదు…అది ఆర్టీసీ కార్మికులకు లైఫ్ లైను అని తెలుసుకోవాలి.
యూనియన్ కు గుదిబండలా మారిన తెల్ల ఏనుగుల మాటలు విశ్వసించి సమ్మెకు దిగడం అంటే కుక్కతోక పట్టుకోని గోదారి ఈదడమేననే సంగతి ఇప్పటికైనా కార్మికులు గుర్తించాలి. ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం అర్థ రాత్రి వరకు ఇచ్చిన మూడు రోజుల లైఫ్ లైన్ను వినియోగించుకొని, సిఎం కెసిఆర్ మీద భరోసాతో బేషరతుగా యధావిధిగా విధులల్లో చేరిపోవడం అటు కార్మికులకు ఇటు రాష్ట్రానికి ఎంతో మంచింది.