KCR:ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత

14
- Advertisement -

ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్..ఈ ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీల‌ను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెల‌వ‌బోతుంది….ఈ ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీల‌ను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెల‌వ‌బోతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్భ‌క ముఖ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌భుత్వం చాలా త‌ప్పులు చేసింది. ఎప్పుడు కానీ ఇంత‌కుముందు ఉన్న ప్ర‌భుత్వం మారి వేరే ప్ర‌భుత్వం కొలువు దీరిన‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వం ఏ విధానాలో అవలంభించిందో ఇంట‌ర్న‌ల్ స‌మీక్ష‌లు చేసి మెరుగైన ప‌నిత‌నం చూపించాలన్నారు. శ్వేత పత్రాలు విడుద‌ల చేసి, చ‌ర్చ పెట్టి ప్ర‌తిప‌క్షాన్ని తుల‌నాడ‌టం, మాట్లాడ‌ని భాష మాట్లాడి ఒక అక్క‌సు వెల్ల‌గ‌క్కి ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌తీసే చిల్ల‌ర రాజ‌కీయ ప్ర‌య‌త్నానికి పాల్ప‌డ్డారు. మూడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల సంయుక్త స‌మావేశంలో 3 వేల మందిని స‌మీక‌రించ‌లేక‌పోయారు. రాహుల్ గాంధీ బ‌స్సులోనే కూర్చోవ‌డం సీఎం బ‌తిమాలికోవ‌డం చూశాం. వ‌చ్చిన డీసీఎంల‌లో జ‌నాల‌ను తొంద‌ర‌గా స్టేడియంలోకి పంపించ‌డం జ‌రిగింది. అది కూడా చూశాం. కాంగ్రెస్ ఓట‌మికి ఇది స్ప‌ష్ట‌మైన సంకేతం అన్నారు.

Also Read:Motkupalli:రేవంత్‌తో ప్రాణ హాని!

- Advertisement -