కే‌సి‌ఆర్ రివర్స్ ఆకర్ష్.. కాంగ్రెస్ విల విల?

75
- Advertisement -

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్య ఆసక్తికరమైన ఫైట్ నడుస్తోంది. ఈ సారి ఎలాగైనా బి‌ఆర్‌ఎస్ ను గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ఈ మద్య యమ దూకుడుగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణలో కూడా అధికారం మాదే అని చెబుతున్నా హస్తం నేతలు.. ఇలాంటి కల్లబొల్లి మాటలతో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే ప్లాన్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే భావన ఆయా పార్టీ నేతల్లో కలిగిస్తే.. పెద్ద ఎత్తున చేరికలు మొదలౌతాయని.. అదే ఊపుతో ఎన్నికల బరిలో దిగవచ్చని హస్తం పార్టీ ప్లాన్స్ వేస్తోంది. .

అయితే ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీనే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టింది. అయితే బి‌ఆర్‌ఎస్ నుంచి పెద్దగా చేరికలు జరగకపోవడంతో కనీసం ఆ పార్టీ భాహిష్కృత నేతలను అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే బి‌ఆర్‌ఎస్ కే‌సి‌ఆర్ వేస్తున్న రివర్స్ ఆకర్ష్ దెబ్బకు హస్తం పార్టీ విలవిలలాడుతోంది.

Also Read:Pawan:’బ్రో’ తొలిరోజు వసూళ్లివే

బి‌ఆర్‌ఎస్ నుంచి చేరికలు ఉంటాయనుకుంటే సొంత పార్టీ నుంచే నేతలు బి‌ఆర్‌ఎస్ వైపు వెళుతుండడంతో హస్తం పార్టీనేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బలంగా ఉన్న ఉమంది నల్గొండ జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు బి‌ఆర్‌ఎస్ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు వినికిడి. ఇంకా మెదక్ జిల్లాలో కూడా ఇద్దరు ముఖ్య నేతలు బి‌ఆర్‌ఎస్ తో టచ్ లో ఉన్నారట. ఇంకా వీరి దారిలోనే పార్టీలో చాలమంది నేతలు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ లో చేరడంపై గుట్టుమట్టుగా ఉన్న నేతలు సమయం సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ కు టాటా చెప్పి గులాబీ కండువా కప్పుకొనున్నారట, దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వికటించి.. కే‌సి‌ఆర్ రివర్స్ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ పనైపోయిందని రాజకీయ వాదులు చెబుతున్నారు.
- Advertisement -