భారతీయుడిగా గర్వపడుతున్నా:కేసీఆర్

20
- Advertisement -

భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా గర్వపడుతున్నాను అని తెలిపారు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏరూపంలో వున్నా… ఏ దేశంలో వున్నా..ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదు అన్నారు.

ఉగ్రవాదం అంతం కావాల్సిందే.. ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి అన్నారు.

భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు కేసీఆర్.

Also Read:ఉగ్రశిబిరాలను తుడిచిపెట్టాం:సోఫియా ఖురేషి

- Advertisement -