బీఆర్ఎస్ మేనిఫెస్టోతో విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం కనబడే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. కేసీఆర్ బీమా -ప్రతి ఇంటికి ధీమా కానుంది. తెలంగాణ అన్నపూర్ణ -సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ఆసరా పింఛన్లు -రూ. 5వేలకు పెంచగా దివ్యాంగుల పింఛన్లు – రూ. 6వేలకు పెంచుతామని ప్రకటించారు.
ఇక రైతు బంధు – రూ. 16వేలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి -పేద మహిళలకు రూ. 3వేల భృతి అందిస్తామని ప్రకటించారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు, అర్హులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పరిమితి – రూ. 15 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ అరోగ్య రక్ష – ఉద్యోగుల వలె జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ళు,అగ్ర వర్ణ పేదలకు 119 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
అనాథ పిల్లల భవిత కోసం ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని…అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలు చేపడతామన్నారు. CPS to OPS సాద్యాసాద్యాలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటనతో సర్వాత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read:బీఆర్ఎస్ మేనిఫెస్టో…కంప్లీట్ డీటైల్స్