సీఎం కేసీఆర్… త్రిముఖ వ్యూహం..!

337
kcr federal plan
- Advertisement -

కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలు దేశరాజకీయాల్లో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌ అంశాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్ వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. అయితే కేసీఆర్‌ ఫెడరల్‌ టూర్‌ ఫెయిలయిందని,అంతగా స్పందన రావడం లేదని కొంతమంది అర్ధం,పర్థం లేని వాదన తెరమీదకు తీసుకువస్తున్నా ఆయన మాత్రం స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా టీఆర్ఎస్‌ కీలకంగా ఉండేలా,తెలంగాణకు ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు కేసీఆర్. గులాబీ బాస్‌ ముందున్న మొదటి ఆప్షన్‌ ఎన్డీఏ. ఎందుకంటే 2014తో పోలీస్తే ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి 180 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడే కేసీఆర్ ప్లాన్‌ ఏను ఇంప్లిమెంటేషన్‌ చేసే అవకాశం ఉంది. వైసీపీ,టీఆర్ఎస్,బిజు జనతాదల్ అవసరమైతే డీఎంకే మద్దతుతో ఎన్డీఏలో చేరడం తద్వారా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీ పొజిషన్‌లో ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

ఒకవేళ బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం లేకపోతే ప్లాన్ బీని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 140 స్ధానాలు వస్తే ఎస్పీ,బీఎస్పీ 50,తృణమూల్ 35,డీఎంకే 36 స్ధానాల్లో గెలిస్తే యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీఏకు కేసీఆర్ మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇందుకు కారణం ఉంది. బీజేపీతో పోలిస్తే సౌత్‌కు కాంగ్రెస్‌ ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చే అవకాశం ఉండటంతో ప్రాజెక్టులు,నిధులు ఎక్కువగా రాబట్టుకోవచ్చని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పక్షంలో కాంగ్రెస్,బీజేపీ అధికారాన్ని ఏర్పాటుచేయడానికి ముందుకురాకుంటే ఫెడరల్‌ ఫ్రంట్ ద్వారా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే రిజల్ట్స్‌కు ముందే ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు కేసీఆర్. మొత్తంగా మే 23 తర్వాత సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -