వెన్నుపోట్లే పునాదిరాళ్లు…రిజల్ట్స్‌ తర్వాత బాబు కథ కంచికే..!

198
chandra babu

జీవితం ఎవరిని విడిచిపెట్టదు…అందరి సరదా తీరుస్తుంది..ఇది ఓ సినిమాలోని డైలాగ్‌..ఇప్పుడు ఇదే డైలాగ్‌ ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వెన్నుపోటు రాజకీయాలతో ఇంతకాలం చక్రం తిప్పుతు వచ్చిన చంద్రబాబుకు రానున్నది గడ్డుకాలమే. తాను ఎదగడానికి అవకాశం వచ్చినప్పడల్లా సొంత పార్టీ నేతలనే కాదు పొత్తుల పేరుతో వివిధ రాజకీయ పార్టీలను తొక్కుకుంటూ వచ్చారు. ఇప్పుడా వెన్నుపోట్ల ప్రభావమే చంద్రబాబు రాజకీయ పతనానికి పునాది రాళ్లుగా మారుతున్నాయి.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి తిరుగులేదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత సీన్ రివర్స్‌. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయింది. ఒకరిద్దరు నేతలు తప్ప టీడీపీలో క్యాడర్‌ కూడా లేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణను వదులుకున్న చంద్రబాబు ఏపీపై పూర్తిదృష్టి సారించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రెండ్స్‌ని పరిశీలిస్తే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు అప్పటివరకు ఎన్డీఏకు మద్దతిచ్చిన బాబు యు టర్న్‌ తీసుకుని మోడీపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. ఫలితంగా టీడీపీ నేతలపై ఐటీ,ఈడీ దాడులతో ఢీలా పడ్డారు.

సీఎం కేసీఆర్… త్రిముఖ వ్యూహం..!

ఈ నేపథ్యంలో చివరకు తన రాజకీయ ప్రత్యర్థి,నాడు తెలుగోడి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్ధాపిస్తే ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునే స్ధాయికి దిగజారారు చంద్రబాబు. అయితే అదికూడా ఆశీంచిన ఫలితాన్ని అందించలేదు. ఇక చంద్రబాబు హిస్టరీ తెలిసిన వాళ్లెవరూ ఇప్పుడు అతడ్ని దరిదాపులకు రానీయడంలేదు.

ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం అధికారంలోకి రాగానే కూరలోంచి కరివేపాకును తీసేసినంత ఈజీగా తీసేయడం అలవాటే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎదురైన అనుభవాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ చంద్రబాబును వ్యూహాత్మక భాగస్వామిగా చూడడంలేదు. అవకాశవాద రాజకీయ నేతగా మాత్రమే చూస్తోంది.మొత్తంగా ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు రాజకీయ ఏకాకిగా మారబోతున్నారు. వెన్నుపోట్లే బాబు పతనానికి పునాది రాళ్లుగా మారాయంటున్నారు విశ్లేషకులు.

కేంద్రంలో హంగ్ వస్తే.. కేసీఆర్ కింగ్ ఢిల్లీలో ఫ్రంట్ కార్యాలయం..

ప్రధానమంత్రిగా దక్షిణాది నేత..కేసీఆర్ ప్లాన్ ఇదే..!