పార్టీకి నష్టం చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఢిల్లీలో పార్టీ ఎంపీలకు విందు ఇచ్చిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మంత్రివర్గ ఏర్పాటుపై కీలకవ్యాఖ్యలు చేశారు. పాలనలో ప్రక్షాళన ఉంటుందని మంత్రివర్గంలో మార్పులుంటాయని తెలిపారు. ఎవరైతే బాగా పనిచేస్తారో వారికే మంత్రి పదవి దక్కుతుందని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఓటమి బాధ కలిగించిందని దీనికి పార్టీ నేతలే కారణమన్నారు. కొందరు ఛైర్మన్లపై వేటు పడనుందని చెప్పారు.
కొంతమంది ఛైర్మన్లు ఎన్నికల్లో సరిగా పనిచేయలేదని మరికొంతమంది కార్యాలయాల్లో ఖాళీగా ఉంటున్నారని తెలిపారు. మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదని అధికారులు,సిబ్బంది అలసత్వాన్ని సహించేది లేదన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతిని కాంక్షిస్తూ పర్యటిస్తున్నానే తప్ప నాకేమీ స్వార్థం లేదన్నారు.
శాసనసభ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎదురైన ఓటమిని పార్లమెంటు ఎన్నికల్లో అధిగమిస్తామని ఈ సందర్భంగా ఎంపీలు కేసీఆర్‌కు తెలిపారు. 16 స్థానాలు ఎంపీ స్ధానాలు గెలుస్తామని ఎంపీలు తెలిపినట్లు సమాచారం.