విశాఖలో ఎఫ్2 ఆడియో

224
f2 movie
- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`. `ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్` ట్యాగ్ లైన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ ఫ‌న్ రైట‌ర్‌ను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు.

ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియో వేడుక డిసెంబర్ 30న జరగనుంది. విశాఖలోని ఆర్కే బీచ్‌లో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభంకానుంది. అయితే ఈ వేడుకకు గెస్ట్‌గా ఎవరు వస్తారనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది చిత్రయూనిట్.

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. మంచి చి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -