భలే భలే బయోపిక్స్‌@2019

223
biopic movies
- Advertisement -

బయోపిక్స్‌…ఇప్పుడిది బాలీవుడ్,టాలీవుడ్ సక్సెస్ మంత్రం.కమర్షియల్‌ హంగులతో వెండితెరపై దర్శనమిస్తున్న ప్రముఖుల జీవితాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రెగ్యులర్‌ సినిమాలతో పోలిస్తే బయోపిక్‌ల సక్సెస్‌ శాతం ఎక్కువగా ఉండటంతో స్టార్స్‌ సైతం పోటీ పడి మరీ నటిస్తున్నారు. ఇందులో కథానాయికలూ తమదైన ముద్ర వేస్తున్నారు.

టాలీవుడ్‌లో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి,మిల్కా సింగ్‌ జీవితం ఆధారంగా ‘భాగ్‌ మిల్కా భాగ్‌’, సిల్క్‌ స్మిత కథతో ‘డర్టీ పిక్చర్‌’ చిత్రాలు వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అదే స్ఫూర్తితో ‘మేరీకోమ్‌’, ‘ఎంఎస్‌ ధోనీ’, ‘హసీనా పార్కర్‌’, ‘నీర్జా’, ‘సరబ్‌జిత్‌’ వంటి బయోపిక్స్‌ ఇటీవల కాలంలో మంచి విజయం సాధించాయి.

బయోపిక్స్‌లో రికార్డు విజయం సాధించిన చిత్రం ‘సంజు’. బాలీవుడ్‌ అగ్ర నటుడు సంజరు దత్‌ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో అదేబాటలో మరికొన్ని సినిమాలు రానున్నాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం సీఎం కేసీఆర్,మాజీ సీఎం ఎన్టీఆర్,వైఎస్ రాజశేఖర్ రెడ్డి,జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.

Image result for బయోపిక్స్ఇక బాలీవుడ్‌ విషయానికొస్తే ఝాన్సీ రాణి లక్ష్మిబాయి జీవిత చరిత్ర ఆధారంగా ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం రూపొందుతుంది. మ్యాథమేటీషియన్‌ ఎక్స్‌పర్ట్‌, సూపర్‌ 30 ఫౌండర్‌ ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా హృతిక్‌రోషన్‌ ప్రధాన పాత్రలో ‘సూపర్‌ 30′ తెరకెక్కుతోంది.

బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో ఓ బయోపిక్‌ రూపొందుతోంది. టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా ’83’ పేరుతో ఓ బయోపిక్‌,షూటర్‌ అభినవ్‌ బింద్రా జీవితం ఆధారంగా రాకేష్‌ ఓం ప్రకాష్‌ ఓ బయోపిక్‌ను రూపొందిస్తుండగా, ఇందులో హర్షవర్థన్‌ సింగ్‌ నటిస్తున్నారు.

వీటితో పాటు శృంగార చిత్రాల కథానాయిక షకీలా జీవితం ఆధారంగా అదే పేరుతో దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ ఓ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే జీవితం ఆధారంగా ‘ఠాక్రే’,మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని నూతన దర్శకుడు విజరు రత్నాకర్‌ ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం జీవితం సైతం తెరపై ఆవిషృతం కాబోతోంది. మొత్తంగా 2019 సంవత్సరం బయోపిక్‌ సినిమాల హవా నడవనుంది.

- Advertisement -