ఆయనే సి‌ఎం.. బి‌ఆర్‌ఎస్ కే పట్టం?

57
- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి జరుగుతోంది. పట్టుమని 5 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. అధికారం కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అయితే విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి బి‌ఆర్‌ఎస్ కు సీట్లు సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఆ పార్టీలకు గ్రామ స్థాయిలో సరైన ఆధారణ లేదనే చెప్పాలి. బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పుకునే ఆ పార్టీ కి క్షేత్ర స్థాయిలో బలమైన నేతలు ఒక్కరూ కనిపించదడం లేదు.

Also Read:హీరోయిన్ ఇంట్లోకి అపరిచితులు

కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేంద్ర వంటి వారు తప్పా ఇతరులేవరు పార్టీ కార్యకలాపాలలో కనిపించడం లేదు. అటు నియోజిక వర్గాల వారీగా చూసుకున్న బరిలో నిలిచే అభ్యర్థిల కొరత బీజేపీలో గట్టిగానే ఉంది. అటు కాంగ్రెస్ కొన్ని నియోజిక వర్గాలలో బలమైన నేతలు ఉన్నప్పటికి బి‌ఆర్‌ఎస్ కు పోటీనిచ్చే స్థాయిలో అభ్యర్థిలు లేరనేది ఎవరు కదనలేని వాస్తవం. 30 నుంచి 40 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేని పరిస్థితి. ఇలా రేస్ లో ఉన్న రెండు ప్రధాన పార్టీల సమీకరణలను చూస్తే అసలు బి‌ఆర్‌ఎస్ కు పోటీనిచ్చే పరిస్థితిలో లేవనేది స్పష్టంగా అర్థమౌతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ విజయం పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈసారి 100 సీట్లు గ్యారెంటీ అని సి‌ఎం కే‌సి‌ఆర్ కూడా నొక్కిచెబుతున్నారు. దీన్ని బి‌ఆర్‌ఎస్ గెలుపు విషయంలో ఆ పార్టీ ఎంత ధీమాగా ఉందో అర్థం చ్సుకోవచ్చు. ఇక ఈసారి విజయంతో వరుసగా మూడు సార్లు సి‌ఎం పదవి అధిష్టించిన నేతగా కే‌సి‌ఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు.

Also Read:రాత్రి నిద్రకు ముందు ఇలా చేస్తే..

- Advertisement -