CM KCR:మెదక్‌కు రింగ్ రోడ్డు

59
- Advertisement -

మెదక్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. మెదక్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం…మెదక్‌కు రింగు రోడ్డు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్ధానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తన కూతురని..ఆమె ఏది అడిగితే అది ఇచ్చి తీరుతానని తెలిపారు.

రామాయంపేట రెవెన్యూ డివిజన్ ,రామాయంపేటలో డిగ్రీ కళాశాల,ఏడుపాయల ఆలయానికి పర్యాటక అభివృద్ధికి వందకోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. 469 గ్రామ పంచాయతీలకు 15 లక్షల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు.

బీఆర్ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని గమనించాలన్నారు. గతంలో మెదక్‌లో నీటి కోసం ఎంత కటకట ఉండేదో గుర్తు చేసుకోవాలని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా గమనించాలన్నారు. పూర్తిస్థాయిలో నీరు, పూర్తి విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. మోటార్లకు పవర్ మీటర్లు అమర్చాలని బీజేపీ కోరుతున్నదని, అది మాకు అక్కరలేదని అన్నారు. ధరణితో రైతులకు ప్రయోజనం చేకూరుతుందటే కాంగ్రెస్ నేతలు మాత్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్,బీజేపీలు అడ్డగోలు హామీలతో వస్తారని వారిని బోంద పెట్టాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్న సీఎం…ఎవరు నిజమైన సేవకులో ప్రజలు గుర్తించాలన్నారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని..రైతు భీమా,రైతు బంధుతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రాణం పోయినా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.ధరణి పోతే మళ్లీ లంచగోండి రాజ్యం వస్తుందన్నారు. మెదక్‌ నుండి పద్మా దేవేందర్ రెడ్డిని గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:ఏపీలో కూడా బండి తీరు మారలే!

- Advertisement -