హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్..

17
- Advertisement -

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రేవంత్ సర్కార్ వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

నిబంధనల మేరకే విద్యుత్‌ కొనుగోలు జరిగిందని…. జస్టిస్‌ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో గత పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ 12 పేజీల సుదీర్ఘ లేఖను ఈ నెల 15వ తేదీన కమిషన్‌కు పంపించారు.

Also Read:ఏపీ స్పీకర్‌కు జగన్ లేఖ

- Advertisement -