పెద్ది కుటుంబసభ్యులకు కేసీఆర్ పరామర్శ

1
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఎర్రవెల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయన పరామర్శించారు.

ఆస్పత్రి వద్ద వైద్యులతో మాట్లాడిన కేసీఆర్, పెద్ది ఆరోగ్య పరిస్థితిని మరియు ఆయనకు అందుతున్న అత్యవసర చికిత్స వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం యశోద ఆస్పత్రిలోనే ఉన్న పెద్ది కుటుంబ సభ్యులను కలిసిన ఆయన, వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. పెద్ది త్వరలోనే కోలుకుంటారని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌లు ఉన్నారు.

Also Read:Cyclops:శాస్త్రవేత్తల షాకింగ్ పరిశోధన

రెండు రోజుల క్రితమే యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం హనుమకొండలోని స్వగృహంలో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆయన భార్య స్వప్న వెంటనే స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసరంగా సీపీఆర్ (CPR) నిర్వహించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ‘గ్రీన్ ఛానల్’ ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -