ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మార్గదర్శకాలకు సీఎం కేసీఆర్ ఆమోదం..

135
cm kcr
- Advertisement -

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సిఎం దృష్టికి తెచ్చారు.

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆమోదం తెలిపారు.

- Advertisement -