రైతుతో కేసీఆర్‌.. నేలపై కేసీఆర్‌ అద్భుత చిత్రపటం..

247
kcr photo
- Advertisement -

తెలంగాణ ఏర్పడే నాటికి రైతులు క్షణమొక యుగంలా గడిపారు…రేపు అనే దానిమీద ఆశ లేదు…ఇటువంటి సందర్భం నుంచి స్వరాష్ట్రంలో వ్యవసాయం పండగల మారింది. రైతుబందు, రైతుభీమా, రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ తీసుకునే సంస్కరణలు..వెరసి ప్రపంచమే రాష్ట్రం వైపు చూస్తున్నది. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా చేయాలన్న సంకల్పంలో రైతుబంధావుడు కేసీఆర్‌ కృషిని కొనియాడుతూ టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతున్న సమయంలో రైతు వెన్నంటే కేసీఆర్‌ ఉన్నట్లుగా ఉండే భారీ అద్బుతాన్ని నెలపైనే చిత్రీంచారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో భూమిపైనే కేసీఆర్‌ చిత్ర పటాన్ని పక్కనే రైతు నాగలిని భుజంపై ఎత్తుకొని ఉన్నట్లు ఉన్న ఈ చిత్రాన్ని.. లక్ష చదరపు అడుగుల్లో ఈ అద్భుతం చేశారు. స్థానిక రైతులు, సోషల్‌ మీడియా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ట్రాక్టర్‌, ప్లవ్‌, కల్టివేటర్‌తో దీనిని రెండు రోజుల వ్యవధిలోపే చిత్రించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన డోన్‌ కెమెరాతో చిత్రించిన వీడియోను సోషల్‌ మీడియాలో సోమవారం టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ పాటిమీది జగన్‌మోహన్‌రావు పోస్టు చేశారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల సమయంలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ పాటిమీది జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60వేల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతుందని అన్నారు. నిర్మాణంలో ఉన్న కుంకుడు చెట్టు తండా ప్రాజెక్టు, నెల్లికల్‌ లిప్ట్‌ ప్రాజెక్టులు పూర్తయితే మరో 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని పేర్కొన్నారు.. కేవలం నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోనే 97,311 మంది రైతు బంధు లబ్దిదారులు ఉన్నారని వివరించారు. తెలంగాణలో రైతు వెన్నంటి ఉన్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా లక్ష చదరపు అడుగుల్లో ట్రాక్టర్‌ ప్లవ్‌, కల్టివేటర్‌ వాడి హాలియా మునిసిపాలిటీలోని కేసీఆర్‌ ఆద్బుత చిత్ర పటాన్ని వేయడం జరిగిందన్నారు.

- Advertisement -