- Advertisement -
ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కేసీ వేణుగోపాల్….పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారని రేవంత్‌పై మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐ యామ్ సారీ రేవంత్…నీకు నీవు బాగా ప్రచారం చేసుకుంటావనే పేరుంది.. భారత్ జోడో యాత్ర విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నావని అందరి ముందే దుయ్యబట్టారు. ఇప్పటివరకు వర్క్ డివిజన్ ఎందుకు చేయలేదు అని నిలదీశారు. పీసీసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
- Advertisement -