అర్ధరాత్రి హడావుడిగా కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేసీ వేణుగోపాల్.. ఎన్నికల ప్రక్రియ సజావుగా ఉండాలంటే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికమైన పాత్ర పోషించేలా ఉండాలని సుప్రీం అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించిందన్నారు.
CECని ఎన్నుకునే ముందు ప్రభుత్వం ఫిబ్రవరి 19న సుప్రీం విచారణ వరకు వేచి ఉండాలి.. హడావుడిగా సమావేశాన్ని నిర్వహించి, కొత్త ఈసీని నియమించాలన్న వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
ఫిబ్రవరి 19న జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా కొనసాగుతారు.ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇవి తొలి ఎంపికలు కావడం విశేషం. జ్ఞానేశ కుమార్ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు.
Also Read:కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్