కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్

21
- Advertisement -

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. జ్ఞానేశ్ కుమార్‌ను ఎన్నుకుంది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ.

కొత్త చట్టం ప్రకారం మొదటి సీఈసీగా నియమితులయ్యారు జ్ఞానేశ్ కుమార్. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రపతి కార్యాలయం. ఫిబ్రవరి 19న జ్ఞానేశ్‌ కుమార్‌ సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా కొనసాగుతారు.

ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇవి తొలి ఎంపికలు కావడం విశేషం. జ్ఞానేశ కుమార్‌ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా నియమితులయ్యారు. జ్ఞానేశ్‌ కుమార్‌ పర్యవేక్షణలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:దక్షిణాఫ్రికాలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు..

- Advertisement -