మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఎక్స్ వేదికగా కేసీఆర్‌కు విషెస్ చెప్పిన కవిత.. ఇవాళ ఉదయం నందినగర్ లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కార్పొరేటర్ మన్నె కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, తెలంగాణకు మంచి జరగాలని పూజలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా బంజారాహిల్స్ నంది నగర్ లోని వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ @RaoKavitha #HappyBirthdayKCR pic.twitter.com/w3tzaHdq9y
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) February 17, 2025
Also Read:తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు