తప్పకుండా సాయం చేస్తా…

185
Kavitha Responds Twitter Post
- Advertisement -

ఏ సమస్యపై అయినా తక్షణమే స్పందించే  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మరోసారి తన ఉదార గుణాన్ని చాటుకుంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ కోసం పూలు తెచ్చేందుకు వెళ్లిన సందర్భంగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కాళ్లు కొల్పోయానని తనకు సాయం చేయాలని మంచిర్యాల,నస్పూర్‌కు చెందిన ఎస్‌ శేఖర్ ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితను కోరారు.

ఈ ఘటన 2014 జనవరి 10న జరిగిందని.., ఆర్థికసాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఆర్థిక సాయం అందలేదు. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం ఇప్పించగలరని కోరుతూ కవితకు శేఖర్ అనే యువకుడు ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు ట్రీట్ మెంట్ కోసం 18 లక్షలు ఖర్చు పెట్టానని…తనకు వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

శేఖర్ ట్వీట్‌పై స్పందించిన కవిత.. తప్పకుండా ఆదుకుంటాను.. మీ వివరాలు santosh.jagruthi@gmail.comకు పంపండని ట్వీట్ చేశారు.

Kavitha

- Advertisement -