- Advertisement -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడంపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం తెలిపాయి. నిజామాబాద్,హైదరాబాద్ రెండు చోట్ల కవిత ఓటు వేసిందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. దీనిపై రాద్దాంతం జరుగుతుండటంతో స్పందించింది ఎన్నికల కమిషన్.
గతేడాది నిజామాబాద్ లో ఓటు వేసి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఓటు వేశారని బీజేపీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది. కవిత నిజామాబాద్ లో ఓటు హక్కు రద్దు చేసుకున్నారని ఎస్ఈసీ తెలిపింది.
ఒక చోట ఓటు హక్కు ఉన్న ఓటర్, మరో చోట ఎలా ఓటు వేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండగా వివాదం మరింత ముదురుతుండటంతో స్పందించింది ఈసీ.
- Advertisement -