నామినేషన్ దాఖలు చేసిన కవిత..

291
kavitha
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ కవిత. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,గోవర్డన్ రెడ్డి,గంగ గోవర్దన్,షకీల్,బిగాల గణేష్ గుప్తా తదితరులు ఉన్నారు.

అంతకముందు నిజామాబాద్‌కు చేరుకున్న ఎంపీ కవితకు ఘనస్వాగతం పలికారు టీఆర్ఎస్ శ్రేణులు. ఇందల్వాయి వద్ద పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ. ఇక టీఆర్ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమేకానుంది.

- Advertisement -