షణ్ముఖ్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక!

25
elimination

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 12 వారంలోకి ఎంటర్‌కాగా ప్రస్తుతం ఇంట్లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక చివరి వారం మానస్ తప్ప అంతా ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఈ సీజ‌న్ చివ‌రి కెప్టెన్‌గా నిలిచే రేసులో ష‌ణ్ముఖ్‌తో పాటు ప్రియాంక‌, ర‌వి నిలిచారు.

తాను ట్రాన్స్‌ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్‌ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌లో నుంచి తొలగించవద్దని కోరింది ప్రియాంక‌. అయితే తాను ర‌వి కోసం ఇప్ప‌టివ‌ర‌కు ఏమి చేయ‌లేక‌పోయాన‌ని అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్‌ చేస్తున్నానని నిర్ణయాన్ని ప్రకటించాడంతో ప్రియాంక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

బాత్‌రూంకి వెళ్లి క‌న్నీళ్లు పెట్టుకుంది. స‌న్నీకూడా ప్రియాంక‌కి స‌పోర్ట్ ఇచ్చిన ఏ మాత్రం ఉప‌యోగం లేకుండా పోయింది. ఫైనల్‌గా షణ్ముఖ్‌, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్‌ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచాడు.