కవిత బెయిల్..24న సమగ్ర విచారణ

21
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు తనపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై వాదనలకు సమయం కావాలని ఈడీ కోరగా విచారణను మే 24కు వాయిదా వేసింది న్యాయస్థానం.

అదేరోజు బెయిల్‌ పై సమగ్రవిచారణ జరపనున్నట్లు ఈడీకి తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్‌ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు నిరాకరించింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Also Read:Rahul:ఆర్టీసీ బస్సులో రాహుల్‌తో సీఎం రేవంత్‌

- Advertisement -