పారిశుధ్య కార్మికులకు టీఆర్ఎస్ నేత సన్మానం..

486
kattela srinivas yadav
- Advertisement -

కరోనా మహామ్మారిని తరమి కోట్టాడనికి ప్రజలలో మనో దైర్యాన్ని నింపిన వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులకు, పోలీసు అధికారులకు ఏం చేసిన వారి రుణం తీర్చుకోలేనిదని గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ మాజీ కట్టేల శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సికింద్రాబాద్ సింధి కాలనీలో ఒక పాజిటివ్ కేసు రావడంతో కార్వంటైన్ జోన్ ఏర్పాటు చేశారు. 14 రోజులలో ఎలాంటి పాజిటివ్ కేసు రాకపోవడంతో నేడు క్వారంటైన్ జోన్ తోలగించడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. గత 14 రోజుల నుంచి కార్వంటైన్ జోన్ లో విస్తృతంగా సేవలు అందించిన వైద్య సిబ్బందికి, పారిశుద్య కార్మికులు, పోలీసులకు సన్మానం చేసి వారి నూతన వస్త్రాలను అందజేశారు కట్టేల శ్రీనివాస్ యాదవ్ దంపతులు.

ప్రజల సహాకారంతో సింధీ కాలనీలో కరోనా మహామ్మారిని తరిమి కోట్టడం జరిగిందని, త్వరలోనే ముఖ్యమంత్రి సూచనలు పాటించినట్లయితే రాష్ట్రం నుంచి కరోనా భూతాన్ని తరమి కోట్టవచ్చని కట్టేల కోరారు. ప్రజలు తప్పకుండా సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని కోరారు కట్టేల శ్రీనివాస్ యాదవ్.

- Advertisement -