మాజీ ఎమ్మెల్యే కట్టా మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

21
CM KCR

సీపిఎం పార్టీ అగ్రనేత, మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా వెంకట నర్సయ్యను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని సీఎం అన్నారు. యుక్త వయస్సులోనే రాజకీయల్లోకి వచ్చి ప్రతీ క్షణం ప్రజల బాగుకోసం పాటుపడిన నర్సయ్య ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.