బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు లవ్‌లో మునిగిపోవడం, కాస్త గ్యాప్ లోనే బ్రేకప్ అయిపోడం కామన్‌గా మారిపోతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో లవ్‌లో పడి, బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.
అంతటితో ఆగకుండా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది కత్రినా. సల్లూతో కాకపోయినా..రణబీర్‌తోనైనా పెళ్ళిపీఠలెక్కుతుందేమో అనుకుంటే.. ఫ్యాన్స్‌కి ఆ ఆశ కూడా లేకుండా.. రణబీర్‌తో కూడా బ్రేకప్ చెప్పేసింది. దాంతో ఈ అమ్మడి లవ్‌కి బ్రేకుల్లేకుండా బ్రేకప్స్ అవుతూనే ఉన్నాయన్నట్టుగా తయారైంది పరిస్థితి.
అయితే రణబీర్ కపూర్ తో బ్రేకప్ విషయంపై తాజాగా కత్రిన మాట్లాడుతూ.. తామిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయామని చెప్పింది. తమ మధ్య ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేంత శత్రుత్వం లేదని, ఒకరికొకరు మ్యాచ్ కాదనే విషయం ఇద్దరికీ అనిపించిందని, అందుకే బ్రేకప్ అయ్యామని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా బ్రేకప్ అయిన తర్వాత కూడా స్నేహితుల్లాగానే ఉండాలని అనుకున్నామని, ఆ తర్వాత సినిమాలతో ఇద్దరం బిజీ అయిపోయామని.. అందుకే మాట్లాడుకోవడం కుదరలేదని చెప్పింది. ఇటీవలే ఓ సందర్భంలో కలుసుకుని, మాట్లాడుకున్నామని చెప్పింది.
తన విషయంలో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదని… ప్రేమ, పెళ్లి ఏదైనా సరే సమయం వచ్చినప్పుడు జరుగుతాయని చెప్పింది. ప్రేమలు విఫలమయినందుకు తానెప్పుడూ బాధపడలేదని వెల్లడించింది కత్రినా.