మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా!

7
- Advertisement -

కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ దంపతులకు కుమారుడు జన్మించాడు. కత్రినా తన గర్భధారణ విషయాన్ని సెప్టెంబర్‌లో వెల్లడించింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు తమ మొదటి సంతానంగా బాబు పుట్టినట్లు ప్రకటించారు. 2021లో వివాహం చేసుకున్న ఈ జంట, కత్రినా గర్భధారణ చివరి దశలో ఉన్న సెప్టెంబర్‌లో ఈ “శుభవార్త”ను అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విక్కీ కౌశల్ ఒక కార్యక్రమంలో తండ్రిగా మారబోతున్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.

“ధన్యులమయ్యాం” …మా చిన్నారి పుట్టాడు. అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో మా బాబు రాకను స్వాగతిస్తున్నాం… నవంబర్ 7, 2025 – కత్రినా మరియు విక్కీ అని తెలిపారు. కరీనా కపూర్ ఖాన్, కత్రినాను “బాయ్ మమ్మా క్లబ్‌కి స్వాగతం” అంటూ అభినందించింది.

హూమా ఖురేషీ ,ఆయుష్మాన్ ఖురానా,నేహా ధూపియా,రామ్ చరణ్ భార్య ఉపాసన,అర్జున్ కపూర్, లారా దత్తా, దియా మీర్జా తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విక్కీ కౌశల్ ముంబైలో జరిగిన యువా కాన్‌క్లేవ్ 2వ ఎడిషన్‌లో పాల్గొని, తండ్రిగా మారబోతున్న అనుభూతిని పంచుకున్నారు. కత్రినా మరియు విక్కీ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సావాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు ఏ సినిమాల్లోనూ కలిసి నటించలేదు.

 

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

 

Also Read:ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ ఆగ్రహం

- Advertisement -