ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ ఆగ్రహం

12
- Advertisement -

ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఓ ప్రజాప్రతినిధి ఇంటిపై దాడులు చేయడం ఏంటి..? చెప్పాలన్నారు. ఓవైపు కాంగ్రెస్ అభ్యర్థి గుండాయిజం, మరోవైపు పోలీసుల అక్రమ నిర్బంధాలు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు.

మాకు సమాచారం ఇచ్చి, మా సమక్షంలో సోదాలు చేయాలి… మేం లేనప్పుడు మా ఇళ్లను వాళ్ల కంట్రోల్ లోకి తీసుకున్నారు… పోలీసులే పైసలు పంచుతున్నారు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే కాదు.. పోలీసులు కూడా రౌడీయిజం చేస్తున్నారు అన్నారు.

ఒడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకుల ఇంటి మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని రేవంత్ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతి నగర్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, కూకట్‌పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు ఇంట్లో సోదాలు చేస్తోంది ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతంలో, అనుమతి లేకుండా పోలీసులు తమ ఇంట్లోకి ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:Trump:త్వరలో భారత్‌కు వస్తా

- Advertisement -