ప్రగతిభవన్‌కు దళిత బంధువులు

177
Huzurabad
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం కోసం హుజురాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన 427 మంది ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఈ సదస్సుకు హాజరయ్యేందుకు హుజురాబాద్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు ప్రజలు. ఎంపిక చేసిన 427 మందితో 16 బస్సులు హుజూరాబాద్‌ నుంచి బయలుదేరగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.

ఈ సమావేశంలో దళితబంధు పథక ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతోపాటు పథకాన్ని విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళితబంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది? దళితుల సామాజిక, ఆర్థికగౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న దళితబంధు పథక ఉద్దేశాలేంటి? వివరించనున్నారు.

- Advertisement -