మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి భార్య మృతి..

156
Kasu Raghavamma
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి అర్ధాంగి రాఘవమ్మ కన్నుమూశారు. రాఘవమ్మ వయసు 97 సంవత్సరాలు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదు సోమాజిగూడలోని తమ నివాసంలో రాఘవమ్మ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలముకుంది. వారి స్వస్థలం గుంటూరు జిల్లా చిరుమామిళ్ల (నాదెండ్ల మండలం). రాఘవమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 1964నుంచి 1971 మధ్యకాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

- Advertisement -