క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న కోహ్లీసేన..

73

న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ జూన్‌ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. ఇంగ్లాండ్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ముంబైలో రెండు వారాల క్వారంటైన్‌ తర్వాత టీమ్‌ఇండియా జూన్‌ 3న ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌లో మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న తర్వాత సాధన షురూ చేసింది. క్వారంటైన్‌ శనివారం ముగియడంతో కొంతమంది ఆటగాళ్లు ఆదివారం పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌ చేశారు.

దాదాపు మూడు వారాల తర్వాత భారత్‌కు ఇదే మొదటి ట్రైనింగ్‌ సెషన్‌.తాజాగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తాను నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. సౌతాంప్టన్‌లో ఫస్ట్‌ ప్రాక్టీస్‌ అంటూ వ్యాఖ్యానించాడు. ఏజీస్‌ బౌల్‌ స్టేడియానికి ఆనుకోని ఉన్న హిల్టన్‌ హోటల్‌లో కోహ్లీసేన బస చేస్తున్నది.